ప్రమోషన్స్ లో “ఆర్‌ఆర్‌ఆర్” కి తోడుగా చేరిన మరో ఆర్… ఎవరంటే

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. “రౌద్రం రణం రుధిరం” పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని అభిమానులు మాత్రం మూడు ఆర్ లను రాజమౌళి, రామ్ చరణ్, రామారావు గా వర్ణిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు అగ్రహీరోలతో కలిసి జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

hero rana join hands with rrr team for movie promotions

అయితే ఈ తరుణంలో ముంబైలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కి ఇప్పుడు మరో ఆర్ యాడ్ అయ్యింది. ఆ ఆర్ ఎవరు అని అనుకుంటున్నారా… అతను ఎవరో కాదు. ‘బాహుబలి’ చిత్రంలో భళ్లాలదేవుడిగా నటింఛీ మెప్పించిన రానా దగ్గుబాటి. ముంబైలో రాజమౌళి, రామ్ చరణ్, రామారావులతో ఉన్న పిక్‌ని రానా దగ్గుబాటి పోస్ట్ చేశారు. రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు రాజమౌళి మధ్య డిస్కషన్ ఎలా ఉంటుందో అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ ఇంటర్వ్యూను విడుదల చేయనున్నారు. కాగా అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీలో నటించారు. ఇప్పుడీ  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *