పుష్పరాజ్​గా మారిపోయిన టీమ్​ఇండియా క్రికెటర్ జడేజా.. తగ్గేదె లే అంటూ వీడియో పోస్ట్

ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పరాజ్​ మేనియా నడుస్తోంది. ఎవరి నోట విన్నా పుష్ప పుష్పరాజ్​.. తగ్గేదె లే అంటూ.. బన్నీ స్టైల్​లో డైలాగ్​లు చెప్తున్నారు. అంతలా పుష్ప జనాల్లోకి ఎక్కేసింది. అయితే, ఈ డైలాగ్​లు సామాన్య ప్రేక్షకులు చెప్తే సరే అనుకోవచ్చు.. అదే సెలబ్రిటీలు కూడా పుష్పలా మారిపోతే.. అవును..ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్​ తగ్గేదె లే అంటూ అభిమానులను ఆకర్శిస్తూ డైలాగ్​ చెప్పారు.

team-india-cricketer-jadeja-imitate-pushparaj

తాజాగా, టీమ్​ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా కూడా పుష్ప లుక్​ను దించేస్తూ.. పుష్ప పుష్పరాజ్ తగ్గేదె లే అంటూ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నిమిషాల్లో వైరల్​గా మారిపోయింది. నెటిజన్లు, బన్నీ ఫ్యాన్స్ జడేజాపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే వీడియోను పుష్ప టీమ్ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిది. ఇది చూసి బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సకుమార్​ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వచ్చిన పుష్ప తొలిరోజే భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది.  రెండో రోజే వందకోట్ల క్లబ్​లో చేరి రికార్డు నెలకొల్పంది. ఇదే జోరుతో ఇంకెన్ని రోజులు కాసుల వర్షం కురిపిస్తాడో తెలియాల్సి ఉంది. కాగా, వచ్చే సంక్రాంతి కానుకగా ఓటీటీలో పుష్పను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించగా.. సునీల్, అనసూయతో పాటు పలువురు కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్​ స్వరాలు అందించారు. సమంత స్పెషల్ సాంగ్​లో అలరించింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *