‘కె.జి.యఫ్ 2’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. లిరిక్స్‌ విన్నారా..!

కన్నడ స్టార్‌ యశ్‌ నటించిన కేజీఎఫ్ 2 సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2018లో రిలీజ్‌ అయిన కేజీఎఫ్ మొదటి పార్ట్ సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కన్నడ స్టార్ హీరో యశ్ అన్ని భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు.  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సీక్వెల్ యే ఈ కేజీఎఫ్ 2.

KGF 2 చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘ఎదగరా.. ఎదగరా.. దినకరా. . జగతికే జ్యోతిగా నిలవరా?’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రవి బసూర్‌ స్వరాలకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సుచేత బసూర్‌ ఆలపించారు. తన కొడుకు ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటూ ఓ తల్లి పాడుతున్న పాట ఆద్యంతం హృదయానికి హత్తుకునేలా ఉంది.

ఇక సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్‌కి ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు సమాచారం. ప్రభాస్ నెక్స్ట్ సినిమా అయిన ‘సలార్’కి ప్రశాంత్ నీల్ దర్శకుడు. దాంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా రానున్నాడని టాక్ నడుస్తుంది. గతంలో సలార్ మూవీ ఓపెనింగ్‌కు యశ్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. మరి కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ వస్తాడా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *