బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరంటే… ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా

బిగ్ బాస్ సీజన్ 5 ఎంత.. హాట్ హాట్ గా కొనసాగిందో మనందరికీ తెలిసిందే. ట్విస్ట్ ల మీద ట్విస్టులు… టాస్క్ ల మీద టాస్క్ లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించారు బిగ్ బాస్ షో కంటెస్టెంట్ లు. అయితే ఈ షో చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో ఈ రియాల్టీ షో కు తెరపడనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది.

interesting details about bigg boss season 5 telugu

మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరు కావచ్చు అనేదానిపై సోషల్ మీడియాలో ఇటు మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కాగా ఈ గ్రాండ్ ఫీనాలే కి బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి, నేచురల్ స్టార్ నాని, కృతి శెట్టి, సాయి పల్లవి హాజరయ్యారు. అలాగే సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. శ్రీయ, డింపుల్ హయతి తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు.

ఇక వి జె సన్నీ, శ్రీ రామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి లు ఫైనల్స్ చేరిన విషయం అందరికీ తెలిసిందే. వీరందరూ ప్రేక్షకులను అలరించడానికి తమ వంతు.. బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చేశారు. ఇక ప్రేక్షకులు వేసే ఓట్లతో వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. ఇక మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఓటింగ్ లో 34 శాతం ఓట్లతో విజే సన్నీ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో షణ్ముఖ్ 31 ఓట్లు, శ్రీ రామచంద్ర 20 ఓట్లు, మానస్ ఎనిమిది ఓట్లు, సిరి ఏడు ఓట్లతో ఉన్నారు. అంటే ఈ లెక్కన బిగ్ బాస్ టైటిల్ విజేత గా వీ జే సన్నీ నిలిచినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే… మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *