ఇప్పటి వరకు జరిగింది చాలు.. ప్రశాంతంగా ఉండనివ్వండి: పూనమ్

ప్రముఖ హీరోయిన్, నటి పూనమ్ కౌర్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కథనం వస్తూనే ఉంటుంది. పూనమ్ కౌర్ వేసే ట్వీట్లు కూడా అలానే ఉంటాయి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌ను పొగిడినట్టుగా ఉంటాయ్.. ఇంకొన్ని సార్లు ఆయన్ను విమర్శించినట్టుగా ఉంటాయ్. అయితే అవి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు అనీ కూడా ఎవ్వరూ గుర్తు పట్టలేరు. అలా ఎప్పుడూ పూనమ్ కౌర్ పరోక్షంగానే ట్వీట్లు వేస్తుంటుంది. ఇక గురూజీ అంటూ దారుణంగా ఆరోపణలు చేస్తూ ట్వీట్లు వేస్తుంటుంది.

poonam kaur clarity on having kids

తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోపై తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో ఫోటో దిగిన పూనమ్‌ దీనికి హ్యాపీనెస్‌ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో క్షణాల్లోనే ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు.. ‘ఆ పిల్లలు ఎవరు మేడమ్‌?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా మరికొంత మంది మాత్రం పూనమ్‌కు పెళ్లైందని.. వాళ్లిద్దరూ ఆమె పిల్లలేనని కామెంట్లు చేశారు. దీనికి సంబంధించి పలు పత్రికల్లో వార్తలూ దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న వార్తలపై పూనమ్‌ స్పందించారు. “ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్‌ చాలు, వాళ్లు నా బెస్ట్‌ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్. నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి’ అంటూ పూనమ్‌ ట్వీట్‌ చేసింది.

https://twitter.com/poonamkaurlal/status/1521856770850795521?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1521856770850795521%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fpoonam-kaur-clarity-having-two-kids-viral-photo-1453893

కాగా చివరిగా ఆమె నాతిచరామి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి. ఇక పూనం కౌర్ ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తుందో అర్థం కాకుండా వారి పేరు మెన్షన్ చేయకుండా కామెంట్స్ చేయడంలో దిట్ట కాబట్టి. ఇప్పుడు ఈ విషయంలో కూడా అభిమానులు ఆమెనే తప్పుపడుతున్నారు. నువ్వు ఫోటో పెట్టి ఊరుకుంటే ఎవరని అనుకోవాలి అందుకే రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. నువ్వు క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంత హడావుడి ఉండేది కాదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *