చిన్నారుల గుండె చప్పుడు మహేశ్‌.. మరో ఫౌండేషన్‌ ప్రారంభం

కేవలం సినిమాలతోనే కాకుండా మంచి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసి అభిమానుల చేత సూపర్ స్టార్, రియల్ హీరో అనిపించుకున్నారు మహేష్ బాబు. తన సేవ గుణంతో ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. భార్య నమ్రతతో కలిసి మహేష్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇప్పటికే వేయి మందికి పైగా చిన్నారులకి హార్ట్‌ సర్జరీలు చేయించిన మహేష్‌.. ఇప్పుడు మరో ముందడుగు వేశారు. ముఖ్యంగా వెయ్యికి పైగా చిన్నారుల గుండె చప్పుడుగా మారారు మహేష్.  వేయి మందికి పైగా చిన్నారులకి హార్ట్‌ సర్జరీలు చేయించిన మహేష్‌.. ఇప్పుడు మరో ముందడుగు వేశారు.

చిన్నారుల హార్ట్‌ సర్జరీల కోసం ఇప్పటికే రెయిన్‌బో, ఆంధ్రా హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తున్న మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ తాజాగా రెయిన్‌బో హాస్పిటల్స్‌కి చెందిన  ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో కలసి పనిచేయనుంది. ఇందుకోసం రెయిన్‌బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ లో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్‌ని ప్రారంభించటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు మహేష్ బాబు.

https://twitter.com/i/status/1500014427025797126

కాగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్‌ ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. చిన్నారులకు హార్ట్‌ సర్జరీలు చేయిస్తూ గొప్ప మనసు చాటుకున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు.  ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మహేష్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *