మహానాడు నిర్వహణ ఒక్కరోజే

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ ప్రతి ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడు ఈ సారి ఒక్క రోజుతోనే ముగించనున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటం, నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఒక్క రోజే చేపట్టాలని పార్టీ ఆలోచించింది. ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును టీడీపీ ఘనంగా నిర్వహిస్తుంది. మూడు రోజుల పాటు సాగే ఈ మహానాడులో పలు తీర్మాణాలను, టీడీపీ చేసిన అభివృద్ధి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలను గురించి చర్చిస్తారు. అయితే ఈ సారి ఒక్క రోజు మాత్రమే మహానాడు జరపాలని నిర్ణయించింది పార్టీ అధిష్టానం.

రాష్ట్రం మధ్యనున్న ఒంగోలులో మహానాడు నిర్వహిస్తే అందరికీ అనువైన చోటుగా టీడీపీ నిర్ణయించింది. మే 27న ఒంగోలులో టీడీపీ ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం జరపునంది. 4 నుంచి 5 వేలమంది పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఇందులో ఆహ్వానితులకు  మాత్రమే విస్తృత స్థాయి సమావేశానికి ప్రవేశం ఉంటుంది. ఒంగోలులో హహానాడును ఎక్కడ నిర్వహించాలన్న ప్రదేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తన బృందంతో కలసి ఎంపిక చేస్తారు. మే 28న జరిగే మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారు.

మహానాడు నిర్వహించే రోజే ఒంగోలులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  మహానాడు సభలోనే ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు ప్రారంభం కానున్నాయి.  ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. గత రెండేళ్లుగా కోవిడ్ వల్ల ఆన్ లైన్ లోనే మహానాడును నిర్వహించారు. అయితే మహానాడుకు ఓ ప్రత్యేక ఉంది. ఎన్టీఆర్ కు ఇష్టమైన వంటకాలను మహానాడులో ప్రతినిధులకు వడ్డిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం టీడీపీ కార్యకర్తలకు ఒక ఉత్సాహాన్నే ఇస్తుంది. అందుకే వారు తమ పసుపు పండగగా భావిస్తారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *