ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరం లేదు : టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర

జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరం లేద అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర కుమార్ అన్నారు. గురువారం నాటి సరసరావుపేట సభలో జగన్ తన నిరాశ, నిస్పృహను బయటపెట్టుకున్నారని విమర్శించారు. జగన్ పాలన చూసి ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహించినందుకే జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. మూడేళ్లుగా సీపీఎస్ రద్దు చేయకపోవడం జగన్ మొదటి అద్భుతమని ఎద్దేవా చేశారు. ఉద్యోగులను పావుగా వాడుకుని పీఆర్సీ తగ్గించిన ఘనత జగన్‍కే ధ్యమైందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి భారం మోపడం మరో అద్భుతమన్నారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని అద్భుత పాలన చూసి మేం ఏడవాలా? అని ప్రశ్నించారు.

రైతుల కష్టాలు ముఖ్యమంత్రికి పట్టడం లేదన్నారు. మిర్చి రైతుల కన్నీటి కష్టాలు మాటల్లో చెప్పలేమని, ఏ ఒక్క రైతు కన్నీళ్లైనా తుడిచే ప్రయత్నం చేశారా? అని ప్రశ్నించారు. పేదల పథకాల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, సామాన్యుడికి ఇసుక దొరికే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. పింక్ డైమండ్.. కోడికత్తి కథలను బ్లూమీడియాలో చూపినవిధంగా ఎవరైనా చూపించారా అని,  ఆకథలన్నీ ఏమయ్యాయో మఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడటం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *