చంద్రబాబు వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది : మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు స్పిల్ వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి డబ్బులు కొట్టేశాడని నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.  అందువల్లే పోలవరాన్ని ఏటీఎంగా మార్చినట్లు మోదీ కూడా అన్నారని గుర్తు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు నిర్వాకం వల్ల వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఇప్పుడు వీటిని మళ్ళీ కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. . ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే తొలిటిసారిగా జరిగిందన్నారు. ఈ ఘనత చంద్రబాబుదే అని విమర్శలు చేశారు.

“పోల‌వ‌రంపై దుష్ప్రచారం జ‌రుగుతోందని, పోల‌వ‌రాన్ని నిర్మించి తీర‌తామన్నారు. పోలవరం పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అంటూ వ్యంగ్యంగా ఓ ప్రధాన పత్రిక రాస్తోందని, సీఎం జగన్‌పై మెల్లగా విషం కక్కుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో మాత్రం పోలవరంలో శరవేగంగా పనులు అంటూ వార్తలు రాసిందని మండిపడ్డారు.

స‌మ‌స్యలను అధిగ‌మించి ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకు సాగుతున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని.. పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నట్ల పేర్కొన్నారు. ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపరని.. దశలవారీగా నింపుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తోందని, 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పోలవరం పనులు చేస్తున్నారని  తెలిపారు. రూ.67 ఉన్న డీజిల్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.110కి పెంచిందని.. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెస్ విధించాల్సి వచ్చిందన్నారు.  ఏలూరు ఘటనలో ప్రభుత్వం స్పందించి, బాధితులకు న్యాయం చేసిందని తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *