భీమ్లా నాయక్‌ ఎఫెక్ట్.. ఉద్యోగులకు సెలవు ప్రకటించిన కంపెనీ..!

తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మాస్‌ జాతర కొనసాగుతుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్, రాణా దగ్గుబాటి నటించిన ఈ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేశారు. అయితే సినిమా చూసేందుకు అభిమానులు ధియేటర్లకి పోటెత్తారు. చాలామంది ఉద్యోగులు సైతం లీవ్‌ పెట్టి మరి సినిమా జాతరకి పయనమయ్యారు. ఇక ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటచేసుకుంది.

kia announce holiday to employees to see pawan kalyan movieపవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్బంగా శుక్రవారం సెలవు కావాలంటూ అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమలో పని చేస్తున్న 400 మంది లైన్ సైడ్ వర్కర్స్ HRకు లేఖ రాశారు. ఒకేసారి ఏకంగా 400 మంది వర్కర్స్ సెలవు పెట్టడంతో రోబోలు సర్వీస్ చేయాల్సి ఉన్నందున మూడు రోజుల ముందే 25 -2-2022 తేదిన సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు HR డిపార్ట్ మెంట్ నోటీసు పంపింది. ప్రతి నెలలో ఒక రోజు నో ఫ్రొడక్షన్ డే గా వర్కర్లకు సెలవు ప్రకటిస్తుంది యాజమాన్యం. ఆ సెలవును శుక్రవారానికి సర్దుబాటు చేసింది. శుక్రవారం సెలవు ప్రకటించినందున ఆదివారం వర్కర్స్ పని చేయాలని కియ యాజమాన్యం స్పష్టం చేసింది.

kia announce holiday to employees to see pawan kalyan movie

కంపెనీ కూడా సెలవు ఇవ్వడంతో అనంతపురం జిల్లా కొత్త చెరువులో సందీప్ సినిమా హాల్ లో కియా ఉద్యోగుల సందడి చేశారు. 400 మంది ఉద్యోగులు బాణసంచా కాల్చి మరీ సినిమా చూశారు. అభిమాన తారల సినిమాలు విడుదల రోజు ఆఫీసుల్లో హాజరు తక్కువగా ఉండటం సహజమే. అందుకే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు అలాంటి సూపర్ స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో హాలీడే ప్రకటిస్తూ ఉంటాయి. ఎక్కువగా రజనీకాంత్ సినిమాలకు ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *