భార్యతో చిరు టూర్‌.. అటు ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి సూపర్‌ అప్‌డేట్‌..!

గత కొంతకాలంగా ‘ఆచార్య’ సినిమాతో బిజీగా గడిపిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమా విడుదల కావడంతో హాలిడే మోడ్ లోకి వెళ్లిపోయారు. తన భార్యతో సురేఖాతో కలిసి విదేశాలకు చెక్కేశారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా పాండమిక్ తరువాత ఇదే తన తొలి ఇంటర్నేషనల్ జర్నీ అని.. చాలా రోజుల తరువాత చిన్న బ్రేక్ తీసుకొని సురేఖాతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నట్లు చిరూ పోస్ట్ చేశారు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్‌ అమ్మ అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్‌’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య’ అని ఉపాసన కామెంట్‌ చేశారు.

Prabhu Deva to choreograph Chiranjeevi, Salman Khan in Godfather

ప్రస్తుతం చిరు మోహనరాజాతో గాడ్ ఫాదర్, బాబీతో ఓ చిత్రం, మెహర్ రమేశ్ తో భోళా శంకర్ చిత్రాలు చేస్తున్నారు. అటు, రాధిక సొంత బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్ లోనూ నటించేందుకు ఓకే చెప్పారు. మరోవైపు, చిరు నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ నుంచి సినీ అభిమానులకు ఆసక్తికర కబురు అందింది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా నృత్య రీతులు సమకూరుస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో తెరకెక్కనున్న హుషారైన గీతానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారంటూ సంగీత దర్శకుడు నెట్టింట ఫొటోను విడుదల చేశారు.

గతంలో చిరు- ప్రభుదేవా కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌హిట్‌ గీతాలు రావడంతో ఇప్పుడు ‘గాడ్‌ ఫాదర్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మలయాళం సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *