అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. సామ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. కాగా సమం పలు అంతర్జాతీ ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన వస్తువులను ప్రమోట్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సైతం సమంత నిత్యం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాగా ఇటీవలే ఓ సంస్థకు చెందిన దుస్తులు, బ్యాగ్‌లను ప్రమోట్‌ చేస్తూ సమంత  ఫోటో షూట్ చేశారు. సంబంధిత ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. వాటిని చూసిన ఇతర సెలబ్రెటీలు, నెటిజన్లు.. హాట్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఆమె టాటూ గురించే చర్చించుకుంటున్నారు.

Samantha gives glimpse of her tattoo in sultry new photoshoot

సమంత తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత.. ఆ బంధానికి సంబంధించిన మెమొరీస్ అన్నింటినీ చెరిపేసే ప్రయత్నం చేసిన సంగతి తెలసింది. తన సోషల్ మీడియా పేజీల నుంచి నాగచైతన్యతో దిగిన ఫొటోలను డిలీట్ చేసింది. అలానే అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన పెళ్లి కానుకులను కూడా వెనక్కి ఇచ్చేసింది టాక్. ఇలా అన్ని రకాలుగా ఆ ఫ్యామిలీ నుంచి సంబంధాలు తెంచుకుంది సమంత. కానీ చైతుకి సంబంధించిన టాటూ మాత్రం ఇంకా క్యారీ చేస్తోంది.

నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమయంలోనే ఆయనకు గుర్తుగా సామ్‌ తన శరీరంపై మూడు పచ్చబొట్లు వేయించుకుంది. అందులో ఒకటి చేతి మణికట్టు వద్ద, మరొకటి మెడ వెనుక, మూడోది నడుము దగ్గర. నడుముపై ‘చై’ పేరుని రాయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయాక చై పేరుతో ఉన్న టాటూని సమంత చెరిపేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోషూట్‌లో ‘చై’ పేరుతో ఉన్న టాటూ కనిపిస్తుండటంతో అందరి దృష్టి దానిపైనే పడింది. చైతుతో అన్ని విధాలుగా తెగదెంపులు చేసుకున్న సమంత.. ఈ టాటూని మాత్రం ఎందుకు ఇంకా కొనసాగిస్తుందో అని నెటిజన్లు అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *