పెళ్లి గురించి స్పందించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి!

Sonakshi Sinha: సినీ ప్రియులకు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో పలు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన ఫ్యాన్స్ కు ఏకంగా గ్లామర్ విందును వడ్డిస్తుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పోస్టులను అప్ డేట్ చేస్తూ తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నటి సోనాక్షి ని ఓ నెటిజన్ పెళ్లి గురించి ముచ్చటించాడు. దానికి సోనాక్షి ఏ మాత్రం విసుగు చెందకుండా తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది.

ఈ భామ తన ఇన్ స్టా ఖాతా ద్వారా నెటిజన్ల తో కాసేపు చిట్ చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు బాగానే సమాధానం చెప్పింది. అంతేకాకుండా ఆమె చేయుచున్న ప్రాజెక్టుల గురించి కూడా స్పందించింది. ఈ క్రమంలో ఒక ఒక నెటిజన్ “సోనాక్షి మేడం.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు అని అడగగా.. ”

దానికి సోనాక్షి సిన్హా “అందరికీ కోవిడ్ వస్తుంది. నాక్కూడా రావాలా..” అని ఆమె ఆ నెటిజన్ నోటికి బాగానే పుల్ స్టాప్ పెట్టింది. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *