RRRకు షాక్.. సినిమా బ్యాన్‌ చేయాలంటూ డిమాండ్‌..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కోసం అశేష ప్రేక్షక జనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది జక్కన్న టీం. దేశమంతా చుట్టేస్తూ.. హడావిడిగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమాను కర్నాటకలో బ్యాన్ చేయాలని కన్నడ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో #Boycott RRR అనే హ్యాష్‌ ట్యాగ్‌ కూడా ట్రెండ్ అవుతోంది.

దీనికి కారణం ఈ సినిమాను కన్నడ భాషలో తక్కవ థియేటర్‌లలో విడుదల చేయడమేనట. కన్నడ భాషను అవమానపరిచేలా తక్కువ స్ర్కీన్‌లలో కన్నడ భాషలో ఈ సినిమాను విడుదల చేస్తున్నరంటూ.. ట్వీట్టర్‌లో #Boycottinkarnataka అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు కన్నడ అభిమానులు. ఇదిలా ఉండగా.. మరి కొందరు ఫ్యాన్స్ కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రస్తుతం థియేటర్‌లలో ప్రదర్శించబడుతుంది. అయితే మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల అయితే జేమ్స్ సినిమా రన్ అవుతున్న థియేటర్లను ఆర్ఆర్ఆర్ ఆక్యూపై చేస్తుందని పునీత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరో రెండు రోజుల్లో సందడి చేయబోతున్న ఈ సినిమాకు అభిమానులు షాక్ ఇస్తున్నారు.

మరోవైపు ఈ చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా ఆర్ ఆర్ ఆర్  విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *