కేజీఎఫ్ నటుడు మృతి

ఇటీవల కన్నడ సినీ పరిశ్రమ నుంచి యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంతకు ముందు వచ్చిన ‘కేజీఎఫ్ 1’ కూడా మంచి విజయం సాధించింది. ‘కేజీఎఫ్ 1’లో ఓ కీ రోల్ లో నటించిన నటుడు మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుంది.

kgf actor mohan juneja passess away

నటుడు మోహన్ జునేజా ఈ ఉదయం కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ఆయన కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించారు. 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఆయన జన్మించారు. ఆయన వయసు 54 సంవత్సరాలు.

మోహ‌న్ జునేజా క‌ర్ణాట‌కలోని తుమ్‌కూర్ జిల్లాలో జ‌న్మించాడు. ‘చెల్లాట’ సినిమాతో ఈయ‌న‌కు క‌న్న‌డ‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఒక విధంగా ఈయ‌న కెరీర్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంలో మోహ‌న్ కమెడీయ‌న్ పాత్ర‌లో న‌టించాడు. దీంతో పాటుగా ‘మ‌స్తీ’, ‘రామ్‌లీలా’,’బ‌చ్చ‌న్‌’, ‘కేజీఎఫ్’ వంటి సినిమాలో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేజీఎఫ్ చిత్రంతో ఈయ‌న‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ‘గ్యాంగ్‌తో వ‌చ్చే వాడు గ్యాంగ్ స్టర్‌.. కానీ అత‌నొక్క‌డే వ‌స్తాడు, మాన్‌స్ట‌ర్’ అంటూ చెప్పిన డైలాగ్ ఈయ‌న‌కు తెలుగులో మంచి పాప్యులారిటీని తెచ్చిపెట్టింది.jకాగా ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *