మళ్లీ నవ్వించడానికి సిద్ధమైన నాని.. ఈ వీడియో చూశారా?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నవ్విస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథానాయకుడు నాని. నేచురల్‌ స్టార్‌ నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికి’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రేపు నాని బర్త్‌ డే సందర్భంగా.. అభిమానులకు ఒకరోజు ముందే నిర్మాణ సంస్థ గిఫ్ట్‌ ఇచ్చింది. ‘అంటే సుందరానికి’ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేయటంతో పాటు మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించేసింది.

https://twitter.com/MythriOfficial/status/1496433442971693057?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1496433442971693057%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fante-sundaraniki-movie-makers-surprise-gift-to-actor-nani-on-occasion-of-his-birthday-23643

‘బర్త్‌డే హోమం’ పేరుతో పంచుకున్న ఈ వీడియో నవ్వుల జల్లు కురిపిస్తోంది. ‘పుట్టినరోజున ఏంటి ఇది? ఇంకో రెండు హోమాలు చేస్తే గిన్నిస్‌ బుక్‌ ఎక్కొచ్చు’’ అంటూ నాని చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వీడియోతోపాటు చిత్ర బృందం చేసిన ట్వీటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘అంటే మావాడి జాతకం ప్రకారం బర్త్‌డే హోమం జరిగిన 108 రోజులు వరకు బయటికు రాకూడదన్నారు. అందుకే జూన్‌ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్లకు వస్తున్నాడు. యువ సుందరుడి బర్త్‌డే హోమం ఇప్పుడే మొదలైంది’’ అని సరదాగా రాసుకొచ్చింది.

నాని సరసన మలయాళ భామ నజ్రియా నజిమ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా వేసవి కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే… ప్రతి సినిమా విడుదల తేదీలు మారుతున్న తరుణంలో ఒకేసారి ఏడు విడుదల తేదీలు ప్రకటించి స‌ర్‌ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు సంబంధించిన 7 విడుదల తేదీలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వాటిల్లోని ఓ తేదీ జూన్‌ 10ని చిత్ర బృందం ఎంపిక చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *