నవ్వుల రారాజు బ్రహ్మానందం లైఫ్ జర్నీ ఏంటో తెలుసా?

Brahmanandam: టాలీవుడ్ ప్రేక్షకులకు హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను అడిక్ట్ చేసుకున్నాడు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే బ్రహ్మీ నటించిన సినిమాలో కామెడీ మరో ఎత్తు అని చెప్పవచ్చు.

Brahmanandam
Brahmanandam

అలా టాలీవుడ్ లో నవ్వుల రారాజు గా చెరగని ముద్రవేసుకున్నాడు బ్రహ్మానందం. ఇక ఫిబ్రవరి 1 న బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా ఆయన లైఫ్ జర్నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ హాస్య నటుడు 1956 ఫిబ్రవరి 1న సత్తెనపల్లి లో జన్మించాడు. పెరిగింది గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం లో ముప్పాళ్ల గ్రామం.

ఇక సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో బ్రహ్మానందం తన హైస్కూల్ చదువు నేర్చాడు. ఆ తర్వాత భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. అలాగే గుంటూరు లో పీజీ చేసి ఎం.ఏ పట్టాని సొంతం చేసుకున్నాడు బ్రహ్మాజీ. ఆ తర్వాత అత్తిలిలో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా లెక్చరర్ గా పని చేశాడు.

ఇక బ్రహ్మి కి చిన్నప్పటి నుంచే మిమిక్రీ చేసేవాడు. సాంస్కృతిక బృందాలలో ఎక్కువగా పాల్గొనేవాడు. ఇక అత్తిలిలో లెక్చరర్ గా పనిచేస్తూనే నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలు పొందాడు బ్రహ్మానందం. అలా బ్రహ్మానందం మొట్టమొదటిగా మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చాడు.

డైరెక్టర్ వెజళ్ళ సత్యనారాయణ నరేష్ కాంబినేషన్లో వచ్చిన ‘తాతావతారం’ చిత్రంలో మొదలుపెట్టిన బ్రహ్మీ నవ్వుల ప్రయాణం ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో అలానే సాగుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *