బన్నీకి చిత్తూరు యాస నేర్పిన వ్యక్తి ఎవరో తెలుసా?

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా సక్సెస్ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో ప్రాణం పోసాడు. అదే విధంగా ఐకాన్ స్టార్ బన్నీ కూడా తన కష్టాన్ని మొత్తం ధారపోసి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ వెర్షన్ లో ప్రేక్షకులను మెప్పించి పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.

ఇక ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో బన్నీ.. చిత్తూరు యాస మాట్లాడడం మరో ఎత్తు.. అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ సగానికి సగం ఏపీ లో మారేడుమిల్లి గ్రామంలో జరిగింది. ఈ కారణంగా నటి నటులు అందరూ చిత్తూరు యాసలోనే మాట్లాడాలి అని డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ ఇచ్చారు.

అలా బన్నీ ఈ సినిమాకు ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. ఇక నాయుడు పేట మండలం పుడేరుకు చెందిన చరణ్ అనే ఓ వ్యక్తి.. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. ఇక చరణ్ కు షార్ట్ ఫిల్మ్ ల పైన కూడ ఆసక్తి ఎక్కువే. ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ సంస్థలో కూడా పనిచేసాడు.

అలా లాక్ డౌన్ టైంలో పుష్ప సినిమాలో నటించడానికి సెలెక్ట్ అయ్యాడు చరణ్. ఈ తరుణంలో చరణ్ యాసకు ఫిదా అయిన డైరెక్టర్ సుకుమార్ ఇక సినిమా మొత్తం అదే కంటిన్యూ చేసాడు. అయితే తను బన్నీతో కలిసి నటించడంతో పాటు ఆయనకు భాష, యాసను నేర్పించడం తన లక్ గా భావిస్తున్నానని చరణ్ తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *