విడాకుల తర్వాత తొలిసారి ‘చై’ ఫోటోను షేర్‌ చేసిన సామ్‌..!

మోస్ట్ లవబుల్ కపుల్‏గా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య, సమంత .. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి గతేడాది అక్టోబర్‏లో ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అనుహ్యంగా ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో సెలబ్రెటీలు, ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. వీరిద్దరు విడిపోయి 6 నెలలు కావోస్తున్న ఎందుకు విడిపోయారనేది మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. విడాకుల ప్రకటన అనంతరం సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. తిరిగి సినిమాలపై ఫోకస్ చేస్తూ.. వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ బిజీ షెడ్యూ్ల్ గడిపేస్తుంది.

Samantha shares ex husband naga Chaitanya photo goes viral

ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో చైతూతో దిగిన కొన్ని ఫొటోలను సమంత డిలీట్ చేశారు. ఇంకా నిజం చెప్పాలంటే… ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో నాగచైతన్యను ఫాలో అవ్వడం మానేశారు. విడాకుల తర్వాత విమర్శలపై స్పందించారు తప్ప ఎప్పుడూ ఎక్కడా మాజీ భర్త గురించి మాట్లాడలేదు. అందువల్ల, నాగ చైతన్య గురించి ఇకపై సమంత మాట్లాడకపోవచ్చని అందరూ ఊహించారు. ఊహలకు తెర దించుతూ… షాక్ ఇస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చైతన్య ఫొటో షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు సమంత. చైతూ.. సామ్ కలిసి నటించిన అందమైన ప్రేమకథా చిత్రం మజిలీ సినిమా 3 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా 3 ఇయర్స్ ఆఫ్ మజిలీ అంటూ మజిలీ సినిమా పోస్టర్ షేర్ చేసింది.  విడాకుల తర్వాత సామ్ మొదటి సారి చైతూ పోస్టర్ షేర్ చేయడంతో.. నెట్టింట్లో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తుండగా.. హరి, హరీష్ ఈ మూవీతో దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *