దేశాలు దాటిన పుష్ప క్రేజ్.. సామీ సామీ అంటూ రష్మికను మించిపోయి మరీ!

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఎర్రచందనం నేపథ్యలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నటన ఒక ఎత్తయితే.. అందులో బన్నీ చిత్తూరు యాస మరొక ఎత్తు అని చెప్పవచ్చు. బన్నీ సరసన ఇండియన్ క్రష్ రష్మిక మందన ప్రేక్షకులను మరింత మెప్పించింది.

pushpa
pushpa

మొన్నటి వరకూ థియేటర్ లో తెగ హడావుడి చేసిన ఈ సినిమా.. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓ టి టి అవతారమెత్తిన సంగతి తెలిసిందే. ఇక పాటల విషయానికొస్తే.. ఇన్ స్టా రీల్సే అవి ఎంత హిట్ అయ్యాయో చెబుతాయి. ఇందులో సామీ.. సామీ పాట ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఫోక్ సింగర్ మౌనిక యాదవ్ ప్రాణం పోసిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో ఆడుతుంది. ఇక ఈ పాటను ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. సెలబ్రెటీలు సైతం ఈ పాటకు ఇన్ స్టా లో స్టెప్పులు వేస్తున్నారు. ఇండియా వైడ్ గా ఫేమ్ తెచ్చుకున్న ఈ సామి.. స్వామి పాట ఇప్పుడు దేశాలు కూడా దాటేసింది. టాంజానియా కు చెందిన అతని పేరు కిల్ పాల్.

 

View this post on Instagram

 

A post shared by Kili Paul (@kili_paul)

ఇతడు సామీ.. సామీ పాటకు తనదైన స్టైల్లో డాన్స్ చేసి నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్ట్ ను ఆ వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోగా రష్మికను మించిపోయాడు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *