జీవితంలో ఎన్నో సార్లు మోసపోనంటూ ఎమోషనల్‌ అయిన మోహన్‌ బాబు

టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు అంటే ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఆయన సినిమాలకు వచ్చిన కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండేవి. దాదాపు ఇండస్ట్రీలోని సీనియర్ దర్శకులు అందరితో నటించి.. హిట్ అందుకున్నారు మోహన్ బాబు. నిన్న మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో ఆయన 70వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.

Mohan babu emotional speech at his birthday celebrations

ఆ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యారు. స్టేజ్‌ మీద ఏం మాట్లాడాలో తెలియడం లేదు గురువు గారు అంటూ దాసరి నారాయణను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు మోహన్‌ బాబు ‘జీవితమంత కష్టాలమమైంది. దాదాపు 7 సంవత్సారాలు తిండిలేక, రెండు జతల బట్టలతో.. కారు షెడ్‌లో ఉంటూ.. ఎదో సాధించాలని పొట్ట చేత పట్టుకుని తిరుపతి నుంచి మద్రాసుకు వెళ్లాను. దేవుని ఆశీస్సులతో దాసరి గారు మోహన్‌ బాబుగా నన్ను పరిచయం చేశారు. ప్రతి క్షణం నా జీవితం ముల్ల బాటగా ఉండేది’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. అలాగే ‘నేను ఎంతో మంది ఉపయోగపడ్డాను. కానీ వారెవరు కూడా నాకు ఉపయోగపడలేదు. ఎన్నో రకాలుగా మోసపోయాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. జీవితం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోంది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Mohan babu emotional speech at his birthday celebrations

అయితే తనతో కొందరు ఎన్నికల ప్రచారం చేయించుకున్నారు కానీ తనకు మాత్రం ఎవరూ ఏమీ చేయలేదంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీ టికెట్స్ రేట్ల ఇష్యూపై రీసెంట్‌గా జరిగిన కొన్ని పరిణామాలు, అదేవిధంగా సన్ ఆఫ్ ఇండియా విడుదల సమయంలో తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మోహన్ బాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *