గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న డాక్టర్ బాబు!

Nirupam Paritala: బుల్లితెర ప్రేక్షకులకు డాక్టర్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అసలు ఆ పేరు చెప్పగానే వెంటనే గుర్తుపడతారు బుల్లితెర ప్రేక్షకులు. బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబు గా మంచి ఫేమ్ తెచ్చుకున్న ‘పరిటాల నిరూపమ్’ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం కార్తీక దీపం తో పాటు మరో సీరియల్ లో కూడా బిజీగా ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా పరిటాల నిరూపమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నాడు. ఎంపీ జోగి మల్లా సంతోష్ కుమార్ ప్రారంభించిన.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నిరూపమ్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న జిహెచ్ఎంసీ పార్క్ లో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు నడిపారు.

ఈ సందర్భంగా నిరూపమ్ ఇలా మాట్లాడుతూ.. పర్యావరణం మీద గొప్ప ఆలోచనతో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ ఛాలెంజ్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని.. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కార్యక్రమం ఎంతో అవసరమని పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని తెలిపాడు.

కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు మనకు ఎంతో సహాయం చేతున్నాయని తెపిపాడు. అందుకే తన వంతు భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలు పంచుకున్నానని నిరుపమ్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో తన తోటి నటులు అయినటువంటి అమర్ దీప్ చౌదరి , ప్రీతమ్, మానస్ వంటి తనకు ఛాలెంజ్ చేశారని తెలిపాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *