టాలీవుడ్ హీరో గా సింగర్ సునీత తనయుడు!

Singer Sunitha Son: సినీ ప్రియులకు సింగర్ సునీత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో పాటలకు ప్రాణం పోసి తన స్వరానికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి స్టార్ హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక బుల్లితెరపై కూడా సునీత పలు షో లలో జడ్జ్ గా చేసింది.

ఇక సునీత తన మాజీ భర్త కిరణ్ కుమార్ కి విడాకులు ఇచ్చి రామ్ వీరపనేని ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే సింగర్ సునీత కొడుకు గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేమిటి అంటే సునీత కొడుకు ఆకాష్ వెండి తెరపై హీరోగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇది తెలిసిన సింగర్ సునీత అభిమానులు కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆకాష్ ని హీరో గా చూపించే క్రమంలో రామ్ వీరపనేని, సునీత బాగా కష్ట పడుతున్నారని తెలిసింది. మరి ఈ విషయం గురించి సింగర్ సునీత అధికారికంగా ఏమని స్పందిస్తుందో చూడాలి. ఇక సింగర్ సునీత కొడుకు ఏ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడో తెలియాలి అంటే వేచిచూడక తప్పదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *