త్రిబుల్ ఆర్ వాయిదాతో మరో సినిమా వైపు కన్నేసిన జక్కన్న..!

Rajamouli: పాన్ ఇండియా స్థాయిలో రాజమౌళి ప్రాణం పోస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వెలువడుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారు అనగా.. ఫ్యాన్స్ జీర్ణించుకోలేని బ్యాడ్ న్యూస్ ను వదిలాడు జక్కన్న. ఇటీవల మొదలైన కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.

Rajamouli
Rajamouli

ఈ క్రమంలో ఎస్ ఎస్ రాజమౌళి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో తమ వేరే చిత్రంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా త్రిబుల్ ఆర్ మూవీ విడుదల ఇప్పుడా.. ఎప్పుడు అని ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్పలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజమౌళి తన తండ్రితో కలిసి మరో చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తాజాగా టాలీవుడ్ లో ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

మహేష్ బాబు తో ఎటువంటి చిత్రం అయినా బాగానే ఉంటుందనే విషయంపై ఇప్పటికే వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇండియా జోన్స్ తరహాలో అడవి నేపథ్యంలో అడ్వెంచర్స్ సినిమా అయితే బాగుంటుందని వారు అనుకుంటున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో పాత్రకి మహేష్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని వారు అనుకుంటున్నారట.

అన్నీ కుదిరితే సంవత్సరం ముగిసే లోపు చిత్రానికి సంబంధించిన స్టోరీని సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది స్క్రీన్ ప్లే వర్క్ పూర్తి చేసి.. డబల్ మీనింగ్ లో ఎలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను మొదలు పెట్టాలనే ఆలోచనలో రాజమౌళి, తన తండ్రి ఉన్నట్లు తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *