మైనారిటీలతో జగన్ చెలగాటమాడుతున్నారు : జలీల్ ఖాన్

మైనారిటీలతో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చెలగాటమాడుతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు దయతో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా తనఖాతాలో వేసుకుంటోందని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమనియోజకవర్గంలో షాదీఖానా నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.1500కోట్లు కేటాయించిందని,  400గజాల స్థలం షాదీ ఖానాకు సరిపోదని 1500గజాలకు పెంచారని గుర్తు చేశారు. షాదీఖానా నిర్మాణం టీడీపీహాయాంలో 99శాతం పూర్తయితే, బుద్ధిలేని వెల్లంపల్లి అంతా ఈప్రభుత్వమే చేసిందని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నియోజకవర్గానికి, ఓట్లేసిన ప్రజలకు ఏనాడు వీసమెత్తు సాయం చేయని వెల్లంపల్లి షాదీఖానానిర్మాణం ఈ ప్రభుత్వ ఘనతగా చెప్పడం దుర్మార్గమన్నారు. షాదీ ఖానాకు నిజంగా నిధులు విడుదల చేసి ఉంటే ఎప్పుడు, ఎంతమొత్తం ఇచ్చారో వెల్లంపల్లి చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం, మైనారిటీ విద్యార్థుల కోసం రూ.7కోట్లతో జూనియర్ కాలేజీని కూడా టీడీపీహయాంలో నిర్మించామని అన్నారు.

నేడు అతే కాలేజీలో కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడాలేవని, అదీ ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.  షాదీఖానా, కాలేజ్ లో గతంలోఏర్పాటుచేసిన శంఖుస్థాపన ఫలకాలను వెల్లంపల్లి తిరిగి ఏర్పాటు చేయాలన్నారు.  టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా కింద ప్రతిపేద ముస్లిం కుటుంబానికి మోయలేనంత సరుకుల సంచి ఇచ్చిందని గుర్తు చేశారు.  చంద్రబాబు ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాలన్నింటినీ తీసేసిన జగన్మోహన్ రెడ్డి  షోచేస్తూ, మైనారిటీలను ఉద్ధరిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడని దుయ్యబట్టారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *