జాతకం ప్రకారం మీ రాశిలో రాహువు ఈ స్థితిలో ఉంటే సమస్యలు మీ వెంటే?

కొన్నిసార్లు జాతకంలో కొన్ని గ్రహాల స్థాన చలనం వల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు మానసిక ఇబ్బందులు కుటుంబ కలహాలు మొదలవుతాయి. ముఖ్యంగా రాహువు చెడు దృష్టికి సంకేతమని చెబుతారు. ఈ క్రమంలోనే రాహువు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిణామాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

రాహువు చెడు స్థితిలో ఉన్నప్పుడు అనవసరంగా ధననష్టం కలుగుతుంది. ఇది రాహువు చెడు దృష్టికి సంకేతం అని చెప్పవచ్చు. రాహువు మన జాతకంలో చెడు స్థితిలో ఉన్నప్పుడు అనవసరంగా కోపాలు రావడమే కాకుండా మన నియంత్రణ కోల్పోతాము. అదేవిధంగా మీ చేతి గోళ్ళు వాటంతటవే విరిగిపోవడం కూడా రాహువు చెడు దృష్టికి సంకేతం. ఎవరి జాతకంలో అయితే రాహువు నీచ స్థితిలో ఉంటాడో అలాంటివారి జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

అదేవిధంగా రాహువు నీచస్తితిలో ఉన్న సమయంలో
ఇతరులను అనవసరంగా మంచి, చెడు అని పిలవడం ప్రారంభిస్తాడు. సంబంధాలు క్షీణించడం మొదలవుతాయి. ఈ క్రమంలోని ఎన్నోరకాల వ్యాధులు కూడా చుట్టుముడతాయి. కనుక రాహువు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా పరిహారం చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు ఏ విధమైనటువంటి నష్టాలు కలగవని చెప్పవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *