ప్రియురాలి మరణవార్త విని తనువు చాలించిన ప్రియుడు.. ఎక్కడో తెలుసా?

ప్రేమ.. ఈ రెండు అక్షరాల మోజులో పడి యువత వారి జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ అన్న ఊబిలో కూరుకుపోయి వారి నూరేళ్ల జీవితాన్ని వారి చేతులతోనే చిదిమేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖం నిలుస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కలేదని, ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ప్రేమించిన యువతి దూరమైందని ఇలా చిన్నచిన్న కారణాలకే పెద్ద నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు బోలెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ప్రేమించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక, తల్లిదండ్రుల ఎదిరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Crime News
Crime News

ఇక తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి ఇక లేదు, తిరిగి రాదు అని తెలుసుకున్న ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇద్దరూ ఒకరి నుండి ఒకరికి ప్రాణం.. కలిసి జీవించాలి అని ఎన్నో కలలు కన్నారు.. కానీ ఇంతలో ఆ ప్రియురాలు మరణించడంతో నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను అంటూ ప్రియుడు కూడా మరణించాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన జాడి రవి అనే 18 ఏళ్ల యువకుడు ఇటీవల పురుగుల మందు తాగాడు.

ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రవి తాజాగా మృతి చెందాడు. వేమనపల్లి మండలం బయ్యారం గ్రామానికి చెందిన దుర్గం సత్య శ్రీ, రవి ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇక సత్యశ్రీ అనారోగ్యం కారణంగా ఈ నెల రెండవ తేదీన మృతి చెందింది. ఇక ఆ విషయం తెలుసుకున్న రవి ప్రియురాలు లేకుండా తాను బతకలేను అంటూ, తన జీవితం వ్యర్థం అనుకొని గ్రామ శివారు కి వెళ్లి పురుగుల మందు తాగాడు. వెంటనే బంధువులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోనీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన రవి తాజాగా మరణించాడు. రవి సోదరుడు జాడి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *