టైమ్ ట్రావెలర్ నుండి వింత సందేశం.. ఈ ఏడాది అవే జరుగుతాయి అంటూ రచ్చ!

చాలా వరకు టైం ట్రావెల్ ను ఎవరు నమ్మలేకపోతారు. సినిమాల్లో చూడటానికి టైం ట్రావెల్ బాగుంటుంది. కానీ నిజజీవితంలో ఇలా జరుగుతుందా అంటే ఎవరూ నమ్మలేకపోతారు. ఎందుకంటే అవి వింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కాబట్టి. ఇప్పటికే టైం ట్రావెల్ నేపథ్యంలో పలు సినిమాలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఏడాది ఏం జరుగుతుందో ముందే కొన్ని వింత సందేశాలు బయట పెట్టాడు ఓ టైం ట్రావెలర్. ఈమధ్య టిక్ టాక్ ప్రభావం వల్ల ప్రతి ఒక్కరు లైక్స్ కోసం తమకు నచ్చినట్లు వీడియోలు చేస్తున్నారు. మరి కొందరు టైమ్ ట్రావెలర్ అంటూ.. భవిష్యత్తు లో ఉన్నాము అంటూ కొన్ని విషయాలు పంచుకుంటున్నారు.

అందులో తాజాగా ఓ టైం ట్రావెలర్ తాను భవిష్యత్తు చెబితే నమ్మట్లేదు అని.. కావాలంటే కొన్ని డేట్లు చెబుతాను ఆ సమయంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి అంటూ కొన్ని విషయాలు తెలిపాడు. ఇంతకూ అవేంటంటే.. మార్చి 11న చింపాంజీ కి వింత శిశువు పుడుతుందని అది మాట్లాడుతుందని అన్నాడు.

ఏప్రిల్ 19న ఒమేగా అనే కొత్త వైరస్ ఉందని అది ఇప్పుడున్న వైరస్ ల కంటే ఐదు రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా సెప్టెంబర్ 17న సముద్రం లో అతి పెద్ద జీవి సెరిన్ క్రాయిన్ ను కనిపెడతారని.. అది తిమింగలం కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ వైరల్ గా మారడంతో.. ఇవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు నెటిజన్లు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *