మహోశ్‌ బాబుని మూడుసార్లు కొట్టానంటూ క్షమాపణ చెప్పిన కీర్తి సురేశ్

సూపర్ స్టార మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. గీత గోవిందం పేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ కు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోనే 24 మిలియన్స్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

I hit Mahesh Babu three times .. Keerthi Suresh made interesting comments

సినిమా విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. మహేష్ బాబు తప్ప మిగిలిన టెక్నీషియన్స్ అందరు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఈ ఇంటర్వ్యూ సెషన్‌లో కీర్తి సురేష్ కూడా భాగమైంది. మహేష్ బాబుతో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. షూటింగ్ సెట్‌లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్‌ను కూడా కీర్తి అభిమానులతో పంచుకుంది. షూటింగ్ సమయంలో తాను మహేష్‌ను మూడు సార్లు కొట్టానని.. ఆ తర్వాత సారీ కూడా చెప్పినట్లు తెలిపింది.

I hit Mahesh Babu three times .. Keerthi Suresh made interesting comments

ఓ సాంగ్ షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మర్చిపోయాయనని… అదే సమయంలో పొరపాటున మహేష్‏ను రెండు సార్లు మిస్ టైమింగ్‏తో కొట్టానని చెప్పింది. ఆ తర్వాత అందుకు సారీ చెప్పానని.. కానీ మూడో సారీ కూడా పొరపాటున కొట్టినట్లు చెప్పుకొచ్చింది. ఆ టైంలో తన గుండె వేగం రెట్టింపైందని చెప్పింది. ఆ సమయంలో ‘నా మీద ఏమైనా పగ ఉందా?’ అంటూ మహేశ్ తనను సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *