మరోసారి యాక్టింగ్ తో అదరగొట్టిన దుల్కర్… హే సినామిక ట్రైలర్ రిలీజ్ !

ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు దుల్కర్ సల్మాన్. మాలీవుడ్ లో స్టార్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ యంగ్ హీరో. తన అద్భుతమైన నటనతో తన సినిమాలకు తెలుగులో కూడా డబ్బింగ్ చెప్పుకొని తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచిపోయారు ఈ కుర్ర హీరో. గత ఏడాది “కురుప్” చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న దుల్కర్… ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం కృష్ణగాడి వీర ప్రేమగాథ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. అలానే ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ ‘హే సినామిక’ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా… అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

hey anamika movie starring dulquer salman trailer released

జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ’96’ ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. రీసెంట్ గానే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ దక్కించుకుంది. మార్చి 4న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. దీంతో ప్రమోషన్స్ అప్పుడే షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మలయాళంలో మమ్ముట్టి ఈ ట్రైలర్ ను విడుదల చేయగా… తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు.

ఈ ట్రైలర్ లో మౌన (అదితి ) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆర్యన్ (దుల్కర్ సల్మాన్). ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ అతడి బిహేవియర్ తో విసిగిపోయిన మౌన విడాకులు తీసుకోవాలనుకుంటుంది. దీనికోసం తనతో కలిసి పని చేసే సాయం కోరుతుంది. ఫ్రెండ్స్ తో కూర్చొని భర్తపై జోకులేస్తుంటుంది మౌన. అదే సమయంలో ఆర్యన్ మరో అమ్మాయితో స్నేహం చేస్తాడు. భర్త మరొకరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేని మౌన తిరిగి అతడికి పొందాలనుకుంటుంది. కానీ ఫైనల్ గా హీరోకి లవ్, ఫ్రెండ్షిప్ రెండింటి మీద నమ్మకం పోతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా. ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *