సమంత ఎంట్రీతో రష్మికలో మొదలైన భయం.. కారణం అదేనా?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరోహీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 17వ తేదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విషయంలో రష్మికకు మరొక భయం మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో రష్మిక ఢీ గ్లామర్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

ఇక శ్రీవల్లిగా రష్మిక ఈ సినిమాలో మనకు కనిపించనున్నారు. ఈ సినిమాలో రష్మిక చేసిన బంగారు సామి అనే పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఏకంగా రెండు మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను రంగంలోకి దింపిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత ఊ అంటావా మావ‌…ఊ ఊ అంటావా అనే పాటకు మాస్ స్టెప్పులను ఇరగదీసింది. ఈ క్రమంలోనే ఈ పాటను విడుదల చేసి మూడురోజులు అయినప్పటికీ ఏకంగా 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే సమంత నటించిన ఈ పాట అత్యధికంగా ట్రెండ్ అవడంతో రష్మికలో ఒక భయం మొదలైందని తెలుస్తోంది. ఇలా సమంత సడన్ ఎంట్రీ ఇచ్చి త‌న పాపులారిటీని ఎక్క‌డ లాక్కెళ్తుందోన‌ని ర‌ష్మిక‌కు తెగ గుబులు ప‌ట్టుకుంద‌ట. మ‌రి పుష్ప సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు రష్మిక నటించిన సినిమా గురించి మాట్లాడుకుంటారా? లేకపోతే సమంత నటించిన పాట గురించి మాట్లాడుకుంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈ సినిమాపై ఇప్పటికే అన్ని భాషలలో భారీ అంచనాలు పెరగడంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఎంతో మంది భావిస్తున్నారు. మరి అందరి అంచనాలను పుష్పరాజ్ చేరుకోగలడా? లేదా? అనే విషయం మరో మూడు రోజులలో తెలియనుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *