కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్!

Keerthi Suresh: టాలీవుడ్ ప్రేక్షకులకు కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘నేను శైలజ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఎంతో మంది యువతను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘మహానటి’ సినిమాతో ప్రేక్షకులను మరింత ఫిదా చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఓ వెలుగు వెలుగుతుంది.

ఇక ఈ భామ సోషల్ మీడియా ఇన్ స్టా లో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పోస్ట్ లను అప్ డేట్ చేస్తూ తన ఫ్యాన్స్ ను మెప్పిస్తుంది. ఇక తాజాగా ఈ మహానటి ఒక యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ” ఈ రోజు జనవరి 26 అధికారిక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను.

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తునందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. సబ్​స్క్రైబ్​ చేసి వీడియోలు చూడండి” అని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది ఈ భామ. ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ అభిమానులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకు పోతుంది.

 

ప్రస్తుతం స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న “గుడ్ లక్ సఖి” లో నటించింది. గణేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కాగా ఈనెల 28న థియేటర్లలో హడావిడి చేయబోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *