ఉక్రెయిన్‌కి టైటానిక్‌ హీరో భారీ విరాళం

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తన వంతు సాయంగా.. 10 మిలియన్ డాలర్లను (రూ.77కోట్లు) విరాళంగా ఇచ్చారు టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో. మెరుగైన సమాజం, పర్యావరణ హితం కోసం లియోనార్డో పలు సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొంటారు. ధన సహాయం చేస్తుంటారు. అయితే ఉక్రెయిన్‌కు ఈ హాలీవుడ్ హీరో ఇంత విరాళం ప్రకటించడానికి వ్యక్తిగత కారణం కూడా ఉంది.

Titanic actor leonardo dicaprio donates 10 million to ukraine

ఆయన అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించారు. అయితే 1917లో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జర్మనీకి వలస వెళ్లింది. జర్మనీలో లియోనార్డో తల్లి యిర్మీలిన్‌కి హెలెన్ జన్మినిచ్చారు. లియోనార్డోకి ఏడాది వయసు ఉన్నప్పుడు భర్త నుంచి యిర్మీలిన్ విడాకులు తీసుకున్నారు. మనవడిని కుమార్తెతో కలిసి హెలెన్ పెంచారు. లియోనార్డోకి అమ్మమ్మతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆవిడ 2008లో మరణించారు.

డికాప్రియో ఇప్పటివరకు ఆరు సార్లు ఆస్కార్​కు నామినేట్ అయ్యారు.  ‘టైటానిక్’, ‘ద మ్యాన్ ఇన్ ద ఐరన్ మాస్క్’తో పాటు కొన్ని చిత్రాల ప్రీమియర్ షోలకు తల్లి, అమ్మమ్మతో కలిసి లియోనార్డో హాజరయ్యారు. అమ్మమ్మ మాతృభూమిలో మనుషులు చేస్తున్న పోరాటానికి అండగా పది మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారు. ఇక లియోనార్డో నటుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహారిస్తున్నారు. అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిట్ తెరకెక్కించిన ‘రెవెనెంట్’లో నటనకు గానూ 2016లో ఆస్కార్ గెలుచుకున్నారు. 1998లో, 25 ఏళ్ల వయసులోనే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ‘లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్​’ను స్థాపించాడు. ‘యాక్టర్ అండ్ ఎకాలజిస్ట్’​ అనే వ్యాసాన్ని చాలా ఏళ్లుగా రాస్తున్నారు డికాప్రియో. వాతావరణ విపత్తులపై పోరులో తన వంతు సాయం అందిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *