ఆది పినిశెట్టి పెళ్లిలో టాలీవుడ్ హీరోల స్టెప్పులు..!

నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగింది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఇవాళ మూడుముళ్లు వేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్‌, బుధవారం ఉదయం హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వేడుకకు పినిశెట్టి బంధువులు, స్నేహితులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Hero Aadi Pinisetty and Nikki Galrani marriage updates

ఈ వేడుకల్లో ఆదికి ఆప్తమిత్రులైన నాని, సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. హల్దీ అనంతరం వధూవరులిద్దరితో కలిసి నాని, సందీప్‌ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆది-నిక్కీలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ కోసం మొదటిసారి ఆది-నిక్కీ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కుదిరింది. ఆ తర్వాత ‘మరగాధ నాణ్యం’ చిత్రీకరణ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ఇక, ‘ఒక విచిత్రం’, ‘గుండెల్లో గోదారి’, ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’ చిత్రాలతో ఆది తెలుగువారికి సుపరిచితులయ్యారు.

కాగా ఈ ఏడాది మార్చి 24న ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారీ లవ్‌ బర్డ్స్‌. ఆ తర్వాత పెళ్లి విషయంపై కూడా సస్పెన్స్‌ కొనసాగించారు. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఓ ప్రెస్‌మీట్‌ నిర్వహించి తమ పెళ్లి వేడుకల గురించి అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆది ప్రస్తుతం ఎనర్జిటిక్‌ హీరో రామ్ హీరోగా న‌టిస్తున్న ది వారియ‌ర్‌లో ప్రతి నాయ‌కుడి పాత్రలో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *