దర్శక, నిర్మాతలకు పవన్ కండిషన్స్.. ఏంటో తెలుసా?

Pawan Kalyan: టాలీవుడ్ ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోకి తన అభిమానులే కాకుండా సెలబ్రేటీలు సైతం ఫిదా అవ్వాల్సిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర స్టార్ హీరోలలో తాను ఒకడిగా వెలుగుతున్నాడు. ఇక పవన్ రాజకీయంగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనకి తెలుసు.

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న బీమ్లా నాయక్ , హరిహర వీరమల్లు ఈ రెండు సినిమాలు త్వరలో థియేటర్ లలో హడావిడి చేయాల్సి ఉంది. ఇక భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ‘హరిహర వీర మల్లు’ చిత్రం షూటింగ్ మరికొంత బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ దర్శక నిర్మాతలకు కొత్త కండిషన్స్ అప్లై చేశారని తెలుస్తోంది.

ఈ రెండు సినిమాల షూటింగ్ కేవలం 60 రోజుల్లోనే ముగించాలని పవన్ కళ్యాణ్ షరతులు పెట్టాడని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అఖిల్ తో ఏజెంట్ చిత్రంలో బిజీగా ఉన్న నరేందర్ రెడ్డి ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే పవర్ స్టార్ తో కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను వీలైనంత వరకు ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ పట్టు పట్టడని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా 2023 నుంచి రాజకీయాలపైనే ద్రుష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. 2024 లో జరగబోయే ఎన్నికలకు పవన్ ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *