హిందీలో ‘పుష్ప’ రికార్డు సాధించడానికి కారణాలు ఏంటో తెలుసా?

ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్ లను అందించింది. నిజానికి తెలుగులో కంటే ఇతర భాషల్లోని కలెక్షన్స్ తక్కువ ఉంటాయని అనుకున్నారు.

కానీ తెలుగులో కంటే ఇతర భాషలలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక హిందీలో కూడా ఈ సినిమా మంచి రికార్డు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు బన్నీ హిందీతెరపై పరిచయం కాలేదు. కానీ ఈ సినిమాతో మాత్రం ఏకంగా హిందీ ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకున్నాడు.

ఇక ఈ సినిమా హిందీలో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే ఇప్పటివరకు ఏ భాషలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా రాలేదు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో శేషాచలం అడవుల్లో తప్ప మరే అడవుల్లో ఎర్రచందనం దొరకదు.

ఇక అల్లు అర్జున్ డిఫరెంట్ స్లాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలా ఈ సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్, అల్లు అర్జున్ స్టైల్ బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా హిందీలో 10 కోట్లకు అమ్ముడు పోగా రూ.26.80 కోట్లను కలెక్ట్ చేసుకుంది. దీంతో పుష్ప బాలీవుడ్ లో బాగానే హిట్ సొంతం చేసుకుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *