త్వరలో కాంబాబు బర్తరఫ్ ఖాయం: అయ్యన్నపాత్రుడు

టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి అంబటి రాంబాబు మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. గతంలో సాధారణంగా ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకునేవారు. కానీ పదవ తరగతి పేపర్ లీక్ అయినప్పటి నుండి విపరీతమైన పోస్టులు పెట్టుకుంటున్నారు.  పరీక్షా పేపర్ లీక్ చేస్తే అరెస్టు చేయక పద్మభూషన్ బిరుదు ఇస్తారా అని అంబటి రాంబాబు పోస్టు పెట్టగా.. హస్కీ వాయిస్ తో ఆడియోలు లీకైతే కాంబాబు అనకపోతే రాంబాబు అంటారా అని, నారాయణ అరెస్టుకు ఆధారాలు లేవు..నీ పరువు తక్కువ పనులకు ఆడియోలు ఉన్నాయి కాంబాబు అని అయ్యన్న కౌంటర్ ఇచ్చారు. దీనికి అంబటి కౌంటర్ ఇస్తూ..అరగంట అంటే నాకు కోపం రాదు కానీ మాధవరెడ్డి..లోకేష్ అంటే మీకు కోపమొస్తుంది మరీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దీనికి కౌంటర్ గా సూరీడు.. జగన్ రెడ్డి అంటే మీకు కోపమొస్తుంది మరి కాంబాబు అనమంటావా ఆడియోలు అడ్డంగా దొరికిపోయిన బ్రోకర్ మూసుకుని ఉండాలి ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే అని పెట్టారు. అంతే కాదు..ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ను లైంగింకంగా వేధించిన వ్యవహారంలో కాంబాబుపై చర్యలు ఖాయమంటూ అయ్యన్న ట్వీట్ చేశారు. ‘సార్ మీ ఇంటర్వ్యూ కావాలంటూ.. కాంబాబుకు యూట్యూబ్ ఛానల్ యాంకర్ వాట్సాప్ మెసేజ్ చేసింది. ఇంటర్వ్యూ ఇస్తే.. నాకేం ఇస్తావు అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు.

అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు. త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్ప లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. దీనిపై అంబటి మళ్లీ స్పందిస్తూ..నన్ను అంటారు తిరిగి అంటే టీడీపీ + ఈనాడు + టీవీ5+ఆంధ్రజ్యోతి కలసికట్టుగా వచ్చి నా మీద పడిఏడుస్తారు. ఎంత ఏడ్చినా ఎంత మొరిగినా తగ్గేదేలే! అని పోస్టు పెట్టారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *