బిగ్‌ బాస్‌ ఓటీటీ ఫస్ట్‌ కెప్టెన్‌.. ఇక రచ్చ రచ్చే..!

హాట్‌ స్టార్‌ ఓటీటీలో మొదలయిన బిగ్‌బాస్‌ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. 24/7 అంటూ ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది. దాంతో పాటు శని, ఆది వారాలు స్పెషల్ ఎపిసోడ్స్‌తో అలరిస్తుంది బిగ్‌బాస్‌. ఈ సారి బిగ్‌బాస్‌లో పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ కలిపి పార్టిసిపేట్ చేయడంతో షో రెండు గ్రూప్‌ల మధ్య సాగుతున్నట్టు ఉంది.

Big boss ott first week nominations and captaincy task

అయితే ఈ నాన్ స్టాప్ బిగ్‌బాస్‌ లో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యల వల్ల అవాంతరాలు ఏర్పడుతున్నాయి. నిన్నటితో బిగ్‌బాస్‌ ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్‌లో ఎదురైన అవాంతరాలకు తెర పడింది.  17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన హౌస్‌లో గొడవలు, ఏడుపులు, ఎమోషన్స్, నామినేషన్స్‌తో ముందుకు వెళ్తుంది. మొదటి వారం నామినేషన్స్, కెప్టెన్సీ టాస్కులు కూడా పూర్తయ్యాయి.

Big boss ott first week nominations and captaincy task

ఆట తొలివారంలో పెద్దగా పసలేకపోయినప్పటికీ తొలివారం కెప్టెన్సీ టాస్క్‌ మాత్రం మంచి రసపట్టులో సాగింది. అఖిల్, సరయు, మహేష్ విట్టా, అరియానా, తేజస్వి మదివాడ, నటరాజ్ మాస్టర్.. ఈ ఆరుగురు కెప్టెన్ పోరులో తలపడ్డారు. ఈ టాస్క్‌లో తేజస్వి మదివాడ గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. అఖిల్‌ తీవ్రంగా కష్టపడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక తేజస్వి నటరాజ్‌ మాస్టర్‌ను రేషన్‌ మేనేజర్‌గా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా కెప్టెన్‌ అవ్వాలనుకున్న అషూ రెడ్డి కనీసం కంటెండర్‌గా కూడా పోటీ చేయలేపోవడంతో బాధతో ఏడ్చేసింది. మరి తేజస్వి కెప్టెన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌ను, హౌస్‌మేట్స్‌ను ఎలా దారిలో పెడుతుందో చూడాలి. ఇక బిగ్‌ బాస్‌ మెుదటివవారంలో సరయు, నటరాజ్‌ మాస్టర్‌, ముమైత్‌ ఖాన్‌, అరియానా గ్లోరీ, మిత్ర శర్మ, హమీదా, ఆర్జే చైతూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక తర్వాతి వారం ఎలాంటి రచ్చ జరగనుందో చూడాలి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *