కమల్‌ హాసన్‌తో సాయి పల్లవి.. ఏ సినిమాలో అంటే..!

తన న్యాచురల్ యాక్టింగ్, అందం, డ్యాన్స్‌తో అందర్నీ మెప్పించి అభిమానులని రోజు రోజుకి పెంచుకుంటుంది సాయి పల్లవి. గత కొన్ని రోజులుగా తన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్‌గా ఉన్న సాయి పల్లవి మే 9న తన పుట్టిన రోజు సందర్భంగా వరుస సినిమాల అప్డేట్స్‌ని ఇచ్చింది. ఇప్పటికే రానా సరసన విరాట పర్వం సినిమాతో రానుంది. గార్గి అనే మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది. వీటితో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది సాయి పల్లవి.

Actress Sai Pallavi on board Kamal Haasan, Sivakarthikeyan film

కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్త నిర్మాణంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రాజ్‌ కుమార్‌ పేరిసామి దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ఈ కథలో భిన్న కోణాలుంటాయనీ, ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. శివకార్తికేయన్‌, సాయిపల్లవి, రాజ్‌కుమార్‌ వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు.

Actress Sai Pallavi on board Kamal Haasan, Sivakarthikeyan film

దేశభక్తి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి స్కోప్ ఉందని.. దానికోసం రష్మికను తీసుకోబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హారీస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *