బాలీవుడ్ బిగెస్ట్ చిత్రంలో భాగమైన మెగాస్టార్ చిరంజీవి..!

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అతి భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ‘సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మన మెగాస్టార్ చిరంజీవి భాగమయ్యారు. అయితే ఆయన స్క్రీన్‌పై కనిపించరు కేవలం వినిపిస్తారు మాత్రమే.

chiranjeevi became the part of bollywood movie brahmstra

ఈ సినిమాలో మొదటి భాగాన్ని…  ‘బ్రహ్మాస్త్రం మొదటి భాగం: శివ’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ట్రైలర్‌ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మొత్తం ఐదు భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ రిలీజ్ కానుంది.  కాగా, ఈ సినిమా ట్రైలర్‌ తెలుగువారికి మరింత చేరువయ్యేలా మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో దీన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు వాయిస్‌ ఓవర్‌ అందిస్తోన్న ఓ వీడియోని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. చిరు చేసిన సాయానికి సంతోషం వ్యక్తం చేసిన ఆయాన్‌ ముఖర్జీ.. ఆయన కాళ్లను తాకి మర్యాదపూర్వకంగా నమస్కరించారు.

పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *