మంచు విష్ణు సినిమాలో సన్నీలియోన్‌..!

మంచు విష్ణు ఇటీవల కొన్ని నెలలుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై విజయం సాధించినప్పటి నుంచి విష్ణు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని సోషల్‌ మీడియాలో ట్రోల్ అవుతుంది. మరికొన్నైతే వివాదాస్పదం కూడా అయ్యాయి. తాజాగా హెయిర్‌ స్టైలిస్ట్‌పై కేసు పెట్టి హైలెట్‌ అయ్యాడు విష్ణు. విష్ణు, మంచు ఫ్యామిలీ ట్రోలర్స్‌కి ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా వాళ్లు మాత్రం తగ్గట్లేదు.

sunny-leon-reentry-with-machu-vishnu-movie

ఇక విష్ణు సినిమాల విషయానికి వస్తే గాలి నాగేశ్వర రావు అనే కామెడీ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోంది. ‘ఆర్‌ఎక్స్‌100’ భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. అయితే చిత్ర యూనిట్ మరో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రంలో విష్ణు సరసన సన్నీలియోన్ కూడా నటించబోతున్నట్లు ప్రకటించారు. రేణుక అనే పాత్రలో తాను నటిస్తున్నట్టు సోమవారం ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

శృంగార తారగా వెలుగు వెలిగిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్‌లో నటిగా రాణిస్తోంది. తన వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది సన్నీ. ఇక ఈ గాలి నాగేశ్వర రావు సినిమాకి ప్రముఖ రచయిత కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. సన్నీ లియోన్‌ గతంలో మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత గరుడవేగలో కూడా నటించగా ఆ తరువాత బాలీవుడ్‌లో బిజీగా మారింది. కాగా ఇప్పుడు మరోసారి తెలుగుకు రీఎంట్రీ ఇస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *