పూజాహెగ్డేతో చిరంజీవి చిలిపి చేష్టలు.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఎనర్జీ, యాక్టింగ్, టైమింగ్, గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బయట ఎంత హుందాగా ఉంటారో అంతే సరదాగా కూడా ఉంటారు. స్టేజ్ ఏదైనా ఆయన తనదైన టైమింగ్‌తో అల్లుకుపోతారు. ఇక చిరు స్టేజ్ పై స్పీచ్ లు ఇచ్చే సమయంలో కొన్నిసార్లు చిలిపిగా మాట్లాడుతుంటారు. అంతేకాదు.. హీరోయిన్లపై నాటీ కామెంట్స్ చేస్తుంటారు. గతంలో ‘రచ్చ’ సినిమా ఆడియో ఫంక్షన్ లో తమన్నా మీద, రీసెంట్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ఈవెంట్‌లో తాప్సీ మీద కొంటెగా కామెంట్స్ చేశారు చిరంజీవి. దానికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.

Mega star chiranjeevi, pooja hegde funny video

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘ఆచార్య’. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో చిత్ర బృందమంతా ప్రమోషన్స్‌ లో బిజీ బిజీగా ఉంది. కాగా ప్రమోషన్స్‌లో ఫోటోషూట్‌ వేళ చిరంజీవి సందడి చేశారు. ఫోటోషూట్‌లో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, పూజాహెగ్డేలను ఒకసారి.. ఆ తరువాత కాంబినేషన్స్ తో ఫొటోలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో పూజాహెగ్డే, రామ్ చరణ్ పక్కకు వెళ్తుండగా.. మీడియా వారిని పిలిచే ప్రయత్నం చేసింది. కానీ వారు పట్టించుకోలేదు.

https://twitter.com/hegdepooja/status/1518884190561136640?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1518884190561136640%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.abplive.com%2Fentertainment%2Fpooja-hegde-chiranjeevi-s-funny-video-going-viral-31071

ఇంతలో చిరంజీవి.. పూజాహెగ్డేను పిలిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె వైపు ప్రేమ బాణాలు వేస్తున్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టారు. చరణ్‌ను పక్కకు పంపించి పూజా పాపతో ఫోటోలకు పోజులిచ్చారు చిరు. దీంతో పూజాహెగ్డే సిగ్గుపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీనిపై పూజా కూడా రియాక్ట్ అయింది. ఈ క్రమంలో చిరు టైమింగ్‌, ఆ సరదా సన్నివేశం తెగ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చిరూ.. యూ.. notty అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *