సామాన్యుల‌కి బంఫ‌ర్ ఆఫ‌ర్… బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్‌!

తెలుగు బుల్లితెర వరుసగా ఐదు సీజన్లు హిట్ అయి.. ఆరో సీజన్‌కు రెడీ అవుతోంది బిగ్‌బాస్ షో. ఇటీవల బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో ముగియగా.. బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు అంతా ఒకచోట చేరి వారు చెప్పుకునే ముచ్చట్లు.. గొడవలతోపాటు వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది..?, ఎలా ఈస్థాయికి వచ్చారు..? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రేక్షకులు క్యూరియాసిటీ చూపిస్తుంటారు. అందుకే బిగ్‌బాస్ షోపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆ షోను ఆదరించే అభిమానులు ఎప్పుడూ ఉంటారు. గత వారం ముగిసిన బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ తెలుగు షోలో బిందు మాధవి విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

golden opportunity for common people to enter into biggboss season 6

తాజాగా బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌తో ముందుకొచ్చింది. సామాన్యులకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే అరుదైన అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ సారి ‘స్టార్ మా’, ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్-6లో సామ్యానులకు కూడా అవకాశం ఇస్తున్నామని నాగ్ వెల్లడించారు. ఇది కేవలం ‘వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం ఓ ప్రమోను విడుదల చేశారు. ‘‘ఇన్నాళ్లూ మీరు ఇంట్లో కూర్చొని ‘బిగ్ బాస్’ హౌస్‌ను చూశారు. అయితే, స్టార్ మా మీకు ఆకాశాన్ని అందుకొనే అవకాశాన్ని ఇస్తుంది’’ అని నాగార్జున వెల్లడించారు. ఇందులో పాల్గొనేందుకు మీరు ఏం చేయాలనే విషయాన్ని వీడియోలో వెల్లడించారు.

https://youtu.be/77BKt5HpUbc

కాగా ‘బిగ్ బాస్’లోకి వెళ్లేందుకు సామాన్యులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఇద్దరు సామాన్యులకు అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఈ సీజన్ బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లాలనుకునేవారు starmaa.startv.com ఓపెన్‌ చేసి మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *