యాంకర్ రవితో అలా సందడి చేస్తున్న అషు రెడ్డి!

Ashu Reddy And Anchor Ravi: అషు రెడ్డి.. ఈ తరం యువతకు ఈ పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. డబ్స్మాష్ ద్వారా ఫేమ్ తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వచ్చిన ఈ భామ.. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. బుల్లితెర ప్రేక్షకుల ముందు తన అందాన్నంతా ఆరబోసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

Ashu Reddy And Anchor Ravi
Ashu Reddy And Anchor Ravi

ఇక ఈ భామ సోషల్ మీడియాలో కూడా బాగా హడావిడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ పోస్టులను నెటిజన్లకు పంచుకొని తన అందం విందును వడ్డీస్తుంది. ఇదే క్రమంలో ఈ భామ మరో కొత్త వీడియో తో సోషల్ మీడియా ముందుకు వచ్చి నెటిజన్లు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.

తనకు మంచి ర్యాపో గా ఉండే తన తోటి యాంకర్ రవి తో ఆ వీడియోలో హడావిడి చేసింది. ఆ వీడియోలో యాంకర్ రవి బైక్ ఎక్కిన అషు రెడ్డి స్టైలిష్ డ్రెస్ వేసింది. ఇక ఆమె బైక్ ఎక్కిన తీరును ఒకసారి చూసిన నెటిజన్లు మరోసారి చూడక తప్పటం లేదు. ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది అషు రెడ్డి.

“సిగ్నల్ క్రాస్ చేశాడే.. నాకు ఇక ఫైన్ పడ్డట్టే” అని ఆ వీడియో కింద మెన్షన్ చేసి పెద్దగా నవ్వింది అషు రెడ్డి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు. “భయ్యా హెల్మెట్ వాడుతున్నావ్ గా.. అసలే పెళ్ళాం పిల్లలు ఉన్నారు. సేఫ్టీ ఫస్ట్” అంటూ నవ్వుతూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *