యూఎస్ ప్రీమియర్స్ లో రికార్డు సృష్టిస్తున్న “పుష్ప”… టాప్ లో అల్లు అర్జున్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీ ఇవాళే రిలీజ్ అవుతోంది. షూటింగ్ ప్రారంభం నుంచి డైరెక్టర్ సుకుమార్ వదిలిన ప్రతి అప్‌డేట్ కూడా బాగా వైరల్ కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఎప్పటిలాగే ఓవర్సీస్‌లో ‘పుష్ప’ ప్రీమియర్ షోస్ పడ్డాయి. అయితే విడుదలకు ముందు నెలకొన్న భారీ హైప్‌తో యూఎస్ ప్రీమియర్స్‌కి ఈ ఏడాది ఏ సినిమాకు లేనంతగా డిమాండ్ నెలకొంది. దీంతో విదేశాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘పుష్ప ది రైజ్’ చూసేందుకు క్యూ కట్టేశారు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

allu arjun pushpa movie creating records in us premier shows collection

ఇంతకాలం స్టైలిష్ పాత్రల్లో కనిపించిన అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్ర చేయడం, రష్మిక కంప్లీట్ డీ గ్లామర్ రోల్ చేయడం ప్రాజెక్ట్‌పై అంచనాలు మరో స్థాయికి తీసుకు వచ్చాయి. సుకుమార్ టేకింగ్, పుష్ప తొలి భాగానికి రెండో భాగానికి లింక్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొత్తంగా యూఎస్ లోని 248 లొకేషన్స్‌లో పుష్ప చిత్రాన్ని విడుదల చేయగా… ఈ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 406కే డాలర్స్ వసూలు చేసినట్లు సమాచారం. దీంతో 2021 సంవత్సరంలో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన తొలి రెండు చిత్రాల్లో ఒకటిగా పుష్ప నిలిచింది. ఇది అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని, పుష్పరాజ్‌గా బన్నీ అదరగొట్టేశారని అంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *