‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం.. ఏమైందంటే..!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో మన ఇండియన్ సెలబ్రెటీస్ చాలా మంది పాల్గొన్నారు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే, ఊర్వశి రౌతేలా, మాధవన్.. తమన్నా.. పూజా హెగ్డే..  ఇలా బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీస్ అంతా పాల్గోన్నారు. ఈ ఏడాది మొదటిసారిగా మన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే కేన్స్ రెడ్ కార్పేట్‌పై అరంగేట్రం చేసి ప్రేక్షకుల మనసులను దొచుకుంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‏లో పూజాకు చేదు అనుభవం ఎదురైందట.. వేడుకలకు వెళ్తూ తన లగేజీ మొత్తాన్ని పోగొట్టుకున్నాంటూ చెప్పుకొచ్చింది పూజా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న పూజా.. కేన్స్ వేడుకల్లో తనకు ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పింది.

Actress Pooja Hegde reveals she lost all her clothes and make-up before her red carpet appearance

‘‘విమాన ప్రయాణానికి రెండు బ్యాగులను అనుమతించకపోవడంతో ఒకదాన్ని భారత్‌లోనే వదిలేయాల్సి వచ్చింది. అలా ఒక్క బ్యాగ్‌తోనే ఫ్రాన్స్‌కు బయలుదేరా. ఈ ప్రయాణంలో అదీ పోయింది. నా దుస్తులు, హెయిర్‌ ప్రొడక్ట్స్‌, మేకప్‌ కిట్‌, అన్నీ అందులోనే ఉన్నాయి. రెడ్‌ కార్పెట్‌పైకి వెళ్లేందుకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ నాలో ఒత్తిడి పెరిగింది. అప్పుడేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏం ఫర్వాలేదనుకుని బాధను దూరంపెట్టి ఫ్రాన్స్‌లో అప్పటికప్పుడు కొత్త డ్రెస్సు తీసుకున్నా. నా టీమ్‌.. హెయిర్‌, మేకప్‌ ప్రొడక్ట్స్‌ తీసుకొచ్చారు. జ్యువెలరీ హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకోవడంతో అవి నాతోనే ఉన్నాయి. వెంటనే రెడీ అయి వేడుకకు హాజరయ్యా. ఈ ఒత్తిడి, ఆందోళన వల్ల నా టీమ్‌ ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినలేదు. రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన అనంతరం అంతా డిన్నర్‌ చేశాం. ఈ అనుభవాన్ని, నా టీమ్‌ అందించిన ప్రోత్సాహాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు.

 

ఇక పూజా పక్షి ఈకల తరహాలో పెద్ద గౌను, డౌమెండ్ ఇయర్‌ రింగ్స్‌, పోనీ టైల్‌తో రెడ్‌ కార్పెట్‌పై తళుక్కున మెరిసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *