త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న స్టార్ క్రికెటర్- హీరోయిన్..!
సెలబ్రెటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా పెళ్లీలు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ జంట ఒక్కటి కాగ.. ఇటీవల ఆలియా భట్ – రణబీర్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కారు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లోనే హీరో హీరోయిన్లు వివాహం చేసుకోగా.. ఇప్పుడు సినీ రంగం – క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు పెళ్లి కి రెడీ అవుతున్నారు.
కాగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మూడేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్నారని బాలీవుడ్లో టాక్. ఈ జంట ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ జంట గురించి తాజాగా ఓ కొత్త అప్డేట్ గుప్పుమంటోంది.
అతియా శెట్టి, రాహుల్ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలనుకుంటున్నారట. పింక్విల్లా కథనం ప్రకారం ఈ జంట ముంబైలోని సుమద్రం పక్కన, బాంద్రా కార్టర్ రోడ్లో 4 బీహెచ్కే అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారని సమాచారం. ఈ అపార్ట్మెంట్ అద్దె నెలకు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత వారు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం.