విజయసాయిరెడ్డిని బహిరంగంగా ఉరితీయాలి : బుద్ధా వెంకన్న

టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 నెలలపాటు జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి జైలులో క్లాస్ మేట్స్ గా ఉన్నారన్నారని, అందు వల్లే దోచుకున్నది సమానంగా పంచుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డికి దమ్ముంటే ఈనెల 21 వ విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్ దగ్గర బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి చేసే అవినీతిపై చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

విశాఖలో ఉంటూ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి శనిలా దాపురించాడని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గజదొంగ అని, నరరూప రాక్షసుడు అని, బహిరంగంగా ఉరి తీయాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  విశాఖపట్నంలోని మదురవాడలో ఏ2 రెడ్డికి భూములు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి తానే రాజు తానే మంత్రి అన్నట్టుగా అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తరాంధ్రలో వీజే ట్యాక్స్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి పేరు ఎత్తగానే రాష్ట్ర ప్రజలంతా వణికిపోతున్నారని విమర్శించారు. తాను అసత్య ఆరోపణలు చేస్తున్నానని విజయసాయి రెడ్డి భావిస్తే దమ్ముంటే మమ్మల్ని పీకించు, మాపై కేసులు పెట్టించు అంటూ సవాల్ విసిరారు.  వైసీపీ ప్రభుత్వం బనాయించే తప్పుడు కేసులకు టీడీపీ భయపడదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని స్పష్టం చేశారు. ప్రజల చేతిలో జగన్ రెడ్డి పీకించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. పాలన చేతకాక ఫ్రస్టేషన్ లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *