రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర..?

రాష్ట్ర  వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే అందుకు తగ్గ విధి విధానాలు విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈనెల 27, 28న నిర్వహించిన మహానాడు సూపర్ సక్సెస్ తో టీడీపీ దూకుడు పెంచబోతోంది. ఇక నుండి ప్రజల్లోనే చంద్రబాబు, లోకేశ్ ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో లోకేశ్ పాదయాత్ర చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నుండి లోకేశ్ పాదయాత్ర చేస్తారని, రాష్ట్రం అంతా పాదయాత్రకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏడాది పాటు ప్రజల్లో ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నారు.

ఇప్పటికే మంగళగిరిలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు లోకేష్. మంగళగిరిలో ఇంటింటినీ టచ్ చేస్తున్నారు. మంగళగిరి మొత్తం చుట్టముట్టిన తర్వాత పాదయాత్రలో వెళ్లే అవకాశం ఉంది. మరో రెండు నెలల్లో మంగళగిరిలో యాత్ర పూర్తి కానుంది. ఆ వెంటనే పాదయాత్రకు సిద్ధం అవుతారని టాక్. గతంలో అక్టోబర్ 2 నుండి చంద్రబాబు పాదయాత్ర చేశారు. అదే సెంటిమెంట్ ను లోకేశ్ నమ్ముకుంటారని, చంద్రబాబులానే యాత్ర పూర్తయ్యేదాకా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది.

ఒక వేళ ముందస్తు ఎన్నికలు వస్తే అక్టోబర్ కన్నా ముందే మొదలెట్టే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి మహానాడు రోజే ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ వారం రోజుల పాటు ఏర్పాట్ల పర్యవేక్షణలో బిజీగా ఉన్న లోకేష్ తన స్వరాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ప్రసంగాన్ని కొద్ది నిమిషాల్లోనే ముగించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో లోకేష్ పాదయాత్రపై టీడీపీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. దీనిపై లోకేష్ స్పందించాల్సి ఉంది.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *