పశ్నాపత్రాల లీకుల పాపం నారాయణదే : సజ్జల

యథావిధిగా ఎప్పటిలాగే అతిపెద్ద గురివిందలా టీడీపీ ప్రవర్తిస్తోందని, పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజ్‌ అంటూ నానా యాగి చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నారాయణ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. గత తెలుగుదేశం  ప్రభుత్వంలో, వాళ్ల ప్రత్యక్ష అజమాయిషీలోనే  ఇలాంటివి ఎన్నో జరిగినా, ఆ కథనాలు మీడియాలో వచ్చినా.. ఏమీ జరగనట్లుగా చూపుతూ వచ్చారని ఆరోపించారు. ‘‘మేం అధికారంలోకి వచ్చాక, గత మూడేళ్ళలో చూస్తే, రెండేళ్లు అసలు పరీక్షలే జరగలేదు. తొలిసారి ఈ ఏడాది పరీక్షలు జరిగితే..  టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా, ఆ రోగం ఛాయలు నారాయణ సంస్థల వల్ల మళ్ళీ పొడచూపాయి.

జగన్‌ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయి అని చూపించాలని టీడీపీ నేతలు తాపత్రాయపడ్డారు. తీరా, టీడీపీ ప్రచారం వికటించి చివరికి వాళ్లే దొరికిపోయారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణే అందులో ఉన్నాడు. అసలు ప్రశ్నాపత్రాల లీకేజీ కల్చర్‌ మొదలైందే నారాయణ, చైతన్య సంస్థల నుంచి. వీళ్లు వందకు వంద శాతం,  వీలైతే 100కు 120 మార్కులు తెచ్చుకున్నట్టు ప్రచారం చేసుకునేలా, వీలైతే ప్రపంచ రికార్డు బద్దలు చేసేవిధంగా తయారై ఇటువంటి తప్పుదారి పట్టారు.   పిల్లలకు సహజంగా పోటీతత్వం, కాంపిటేటివ్‌ స్పిరిట్‌ తో పరీక్షలు నిర్వహించాల్సింది పోయి, ఆ పరిస్థితిని దశాబ్ధాలుగా మార్చేసి, మాస్‌ కాపీయింగ్‌, పేపర్లు లీకేజీలకు స్పెషలిస్ట్‌లుగా వ్యవస్థను తయారు చేశారు.

ఇది తొలిసారి బద్దలైంది. పరీక్షాపేపర్ల లీకేజీని వైయస్సార్‌ సీపీవాళ్లే ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఎంతగా దుష్ప్రచారం చేసినా.. అది కాస్తా వికటించి వాళ్లకే దెబ్బ కొట్టింది. ఆ తీగ లాగితే అరెస్ట్‌ అయినవాళ్లు అంతా టీడీపీవాళ్లే. వాళ్లకు సంబంధించివాళ్లే ఉన్నారు.  విద్యార్థుల నుంచి అధికమొత్తంలో ఫీజులు కట్టించుకుని, విద్యార్థుల తల్లిదండ్రులు ఉసురుపోసుకుని, విద్యార్థులకు యాంత్రికమైన చదవులు అంటకట్టి.. ఆ ప్రాసెస్‌లో వేలకోట్లు సంపాదించి, అందులో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నారాయణ టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ వాళ్ళు ప్రోత్సహించిన ఈ విధానం ఒక చీడలా తయారై పరీక్షలు పెట్టడం అంటేనే కష్టమైనది, దుస్సాధ్యమైనదిగా, ఉపాధ్యాయు లోకానికి కూడా మచ్చ వచ్చేవిధంగా తయారైంది.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *